Ponniyin Selvan-1 Movie Review Telugu పొన్నియిన్ సెల్వన్ - 1 - Telugu Cinema Samacharam

Breaking

Post Top Ad

Post Top Ad

Friday 30 September 2022

Ponniyin Selvan-1 Movie Review Telugu పొన్నియిన్ సెల్వన్ - 1

 


నటులు:
విక్రమ్,జయం రవి,కార్తీ,ఐశ్వర్యా రాయ్ బచ్చన్,త్రిష,విక్రమ్ ప్రభు,ప్రకాష్ రాజ్,శరత్ కుమార్,పార్థీబన్
 
దర్శకుడు: మణిరత్నం
 
సినిమా శైలి:Drama, History, Action, Adventure
 

విమర్శకుల రేటింగ్

3.0/5

బలమైన కథ, గ్రాండ్ విజువల్స్‌, భారీ హంగులతో సినిమాను రూపొందిస్తే భాష, ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఆదరిస్తారని ‘బాహుబలి’తో రుజువైంది. ఈ సినిమాతో ఎస్.ఎస్.రాజమౌళి పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ సక్సెస్ కావడంతో చాలా మంది ఫిల్మ్ మేకర్స్‌కి తమ కలల ప్రాజెక్ట్‌లు తెరకెక్కించడానికి ధైర్యం వచ్చింది. అలాంటి ఒక ధైర్యంతోనే దిగ్గజ దర్శకుడు మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను వెండితెరపై ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నారు. దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావించిన మణిరత్నం.. మొదటి భాగం ‘పొన్నియిన్ సెల్వన్: 1’ను నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ ‘చోళ’ కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

 
కథ:
చోళ రాజ్య చక్రవర్తి సుందర చోళుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు, పట్టపు యువరాజు అయిన ఆదిత్య కరికాలుడు (విక్రమ్) పాండ్యులను జయించి ఒక్కో రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ వెళ్తుంటాడు. మరోవైపు, ఆదిత్య కరికాలుడి తమ్ముడు అరుణ్‌మొలి వర్మ అలియాస్ పొన్నియిన్ సెల్వన్ (జయం రవి).. శ్రీలంకను ఆక్రమించుకోవడానికి సైన్యంతో దండెత్తుతాడు. తంజావూరు కోటలో ఉన్న చక్రవర్తి సుందర చోళుడి (ప్రకాష్ రాజ్) ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇలాంటి సమయంలో చోళ రాజ్యంలో అంతర్గత కుట్రలు జరుగుతుంటాయి. చోళ రాజ్యాధికారాన్ని చేజిక్కుంచుకోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. అలాగే, చోళ రాజ్యాన్ని అంతమొందించడానికి మరికొందరు కుట్ర పన్నుతుంటారు. ఈ కుట్రల సమాహారమే ‘పొన్నియిన్ సెల్వన్: 1’ కథ.

 
టెక్నికల్‌గా చూసుకుంటే.. విజువల్‌గా సినిమా బాగుంది. రవివర్మన్ సినిమాటోగ్రఫీ బాగున్నా.. దానికి జోడించిన విజువల్ ఎఫెక్ట్స్ అంత గొప్పగా అనిపించలేదు. ఎ.ఆర్.రెహమాన్ పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి. అయితే, కొత్తదనం ఏమీ కనిపించలేదు. ఈ సినిమాకు తనికెళ్ల భరణి మాటలు అందించారు. సినిమా తెలుగు ప్రేక్షకుడికి అర్థమయ్యింది అంటే అది కచ్చితంగా తనికెళ్ల భరణి మాటల వల్లే అని చెప్పుకోవచ్చు. అంత స్పష్టంగా, క్షుణ్ణంగా ఆయన డైలాగులు ఉన్నాయి.
  

No comments:

Post a Comment

Post Top Ad