దేశంలో చాప కింద నీరులా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రజలందరూ కరోనా వైరస్ సోకకుండా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మాస్క్ ధరించినా కొన్ని తప్పులు చేస్తే వైరస్ భారీన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
యూఎస్ గవర్నమెంట్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మాస్క్ ధరించి ఎదుటి వ్యక్తులతో ముఖాముఖి మాట్లాడితే ఆ సమయం 4 నిమిషాల కంటే ఎక్కువగా వైరస్ రిస్క్ ఎక్కువగా ఉన్నట్టేనని తెలిపింది. ఎవరైనా ఆరడుగుల దూరంలో 45 నిమిషాల లోపైతే మాత్రమే లో రిస్క్ అని సమయం దాటితే హై రిస్క్ అని నివేదిక వెల్లడించింది. ఎవరైనా పక్క నుంచి నడుస్తూ, పరుగెత్తుతూ, సైక్లింగ్ చేస్తూ వెళ్లినా తక్కువ ప్రమాదంలో ఉన్నట్టేనని పేర్కొంది.
బాగా వెలుతురు ఉన్న ప్రదేశాల్లో మనుషుల మధ్య దూరం పాటించడం వల్ల రిస్క్ తక్కువేనని నివేదిక పేర్కొంది. నిత్యావసర వస్తువులు, సరుకుల కొనుగోళ్ల సమయంలో మీడియం రిస్క్ ఉంటుందని... ఇండోర్ స్పేసెస్ లో హై రిస్క్ ఉంటుందని నివేదిక వెల్లడించింది. కామన్ ఏరియాలు, పబ్లిక్ బాత్ రూంలలో కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఏసీ షాపులు, ఆఫీసులు, పాఠశాలలు, ఇతర పని ప్రదేశాల్లో మాస్క్ ధరించినా కరోనా రిస్క్ ఎక్కువేనని సమాచారం.
పార్టీలు, పెళ్లిళ్లు, థియేటర్లలో కూడా రిస్క్ ఎక్కువేనని సీడీసీ తెలిపింది. ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రిస్క్ లను గమనిస్తూ అందుకు అనుగుణంగా సమయాన్ని వెచ్చించాలని తెలిపింది. మాస్క్ ధరించినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.
No comments:
Post a Comment