ఫ్యామిలీ మ్యాన్‌-2కు స‌మంత ఎంత తీసుకుంది? - Telugu Cinema Samacharam

Breaking

Post Top Ad

Post Top Ad

Thursday 10 June 2021

ఫ్యామిలీ మ్యాన్‌-2కు స‌మంత ఎంత తీసుకుంది?

 


ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజ‌న్ రిలీజ్‌కు ముందు, త‌ర్వాత చ‌ర్చంతా స‌మంత అక్కినేని గురించే. ఈ సిరీస్‌లో లీడ్ రోల్ చేసిన మ‌నోజ్ బాజ్‌పేయి సెకండ్ సీజ‌న్‌లోనూ అద‌ర‌గొట్టేశాడు. ఆయ‌న పెర్ఫామెన్స్ గురించి ఎంత‌మాత్రం త‌క్కువ చేయ‌డానికి వీల్లేదు. కానీ రెండో సీజ‌న్ రిలీజ్ ముంగిట స‌మంత పాత్ర గురించి వివాదం నెల‌కొన్న నేప‌థ్యంలో ప్రేక్ష‌కుల దృష్టంతా దాని మీదే నిలిచింది. ఇక సిరీస్ చూశాక అంద‌రూ స‌మంత గురించే మాట్లాడుకున్నారు.

ఎల్టీటీఈ స‌భ్యురాలైన‌ రాజి పాత్ర‌లో స‌మంత ఇచ్చిన పెర్ఫామెన్స్ చూసి అంతా ఫిదా అయిపోయారు. పాత్ర‌గా కూడా అది బాగా ఆక‌ట్టుకుంది. కొన్ని బోల్డ్ సీన్స్, అలాగే యాక్ష‌న్ ఘ‌ట్టాలైతే మైండ్ బ్లోయింగ్ అనిపించాయి. సినిమాల‌తో వ‌చ్చిన పేరు కంటే ఈ సిరీస్‌కు ఎక్కువ ఫేమ్ తెచ్చుకుంది స‌మంత‌.

రాజి పాత్ర‌తో ఇంత‌గా ఈ సిరీస్‌కు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన స‌మంత‌.. ఈ పాత్ర కోసం ఎంత పారితోష‌కం తీసుకుని ఉంటుందన్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది. ఓ సినిమాకు సామ్ గ‌రిష్టంగా తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ రూ.2 కోట్లు కాగా.. ఫ్యామిలీ మ్యాన్‌-2లో రాజి పాత్ర కోసం మాత్రం దాని మీద రెట్టింపు మొత్తం అందుకుంద‌ట‌. ఈ సిరీస్ కోసం ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి రావ‌డం, పాత్ర కోసం ప్రిపరేష‌న్ కూడా చాలా ఉండ‌టంతో ఆమెకు భారీ పారితోష‌క‌మే ఇచ్చార‌ట‌

No comments:

Post a Comment

Post Top Ad